రేపు కళ్యాణదుర్గంలో స్పందన

ATP: కళ్యాణదుర్గం పట్టణంలో సోమవారం డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్డీటీ ఏకలాజికల్ సెంటర్‌లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని డివిజన్ పరిధిలో సమస్యలు ఉన్నవారు వచ్చి సమస్యను అర్జీ రూపంలో సమర్పించి పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.