పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావు: కమిషనర్

KMR: పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా నాలుగో వార్డులో శుక్రవారం తడి పొడి చెత్తను వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మురుగు కాలువల్లో దోమల నివారణ మందు పిచికారి చేయించారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛతకు సహకరించాలని పేర్కొన్నారు.