VIDEO: గిరి ప్రదక్షిణలో ఆకట్టుకున్న కోలాటం

VIDEO: గిరి ప్రదక్షిణలో ఆకట్టుకున్న కోలాటం

ప్రకాశం: సింగరాయకొండలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో చైత్ర పౌర్ణమి సందర్భంగా గురువారం గిరిప్రదక్షిణ వైభవంగా జరిగింది. దక్షిణ మెట్ల మార్గం ఎదురు ఉన్న మండపం నుంచి దేవస్థానం ఈవో కృష్ణవేణి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. సమీప గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు భజనలు, మహిళలు కోలాటం వేస్తూ ప్రదక్షణ చేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.