కిమ్స్‌లో గుండె చికిత్సకు అందుబాటులో అత్యాధునిక పరికరం

తూ.గో: అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో గుండె చికిత్స కొరకు అత్యాధునిక పరికరాలను ఉపయోగంలోకి తీసుకువచ్చినట్లు డా.హరికిరణ్ వర్మ తెలిపారు. అంబాజీపేటకు చెందిన వ్యక్తికి ఈ అత్యాధునిక పరికరం ద్వారా కెమేరాను లోపలికి పంపి మూసుకుపోయిన రక్తనాళాలకు స్టెంట్ వేసినట్లు తెలిపారు. బైపాస్ సర్జరీ అవసరం లేకుండా ఒ.సీ.టీ పరికరం ద్వారా ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.