ప్రధాని పర్యటనలో ప్రజలకు పులిహోర సిద్ధం

కృష్ణా: నూజివీడు మండలం మర్రిబంధం గ్రామం నుండి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వెళ్లే ప్రజల కోసం శుక్రవారం పులిహార సిద్ధం చేశారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసే బస్సులను రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ప్రారంభించనున్నారు. ఎంపీడీవో రాఘవేంద్రనాథ్ పర్యవేక్షణలో 1500 మంది ప్రజలకు ప్రత్యేక బాక్సులలో పులిహారను ప్యాక్ చేశారు.