20 కిలోల టమాటా రూ. 60.. రైతుల ఆవేదన!

20 కిలోల టమాటా రూ. 60.. రైతుల ఆవేదన!

HYDలో టమాటా ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. బోయిన్‌పల్లి మార్కెట్‌లో గత మూడు, నాలుగు రోజులుగా టమాటా ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 20 కిలోల టమాటా పెట్టె ధర కేవలం రూ. 60 నుంచి రూ.150 మధ్య మాత్రమే పలుకుతుంది. సరఫరా ఎక్కువగా రావడం వల్ల ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.