ఈనెల 21న అంబర్‌పేట్ చెరువు వద్ద బతుకమ్మ ఆడుడే..!

HYD: అంబర్‌పేట్‌లో హైడ్రా పునరుద్ధరించిన బతుకమ్మ కుంట చెరువు వద్ద సెప్టెంబర్ 21న భారీ ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించింది. పునరుద్ధరణ, సుందరీకరణ పనులు త్వరగా పూర్తి కావాలని కమిషనర్ రంగనాథ్ అధికారులకు సూచించారు. చెరువు చుట్టూ సుందరీకరణతో పాటు, కూర్చొని సేదతీరే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.