'రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి'

E.G: ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని రైతు సాధికార సంస్థ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ అన్నారు. అనపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. డ్రమ్ సీడర్ విత్తనాలు పిచికారీ చేసే విధానాన్ని పరిశీంచారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మాధవ్ రావు పాల్గొన్నారు.