బేస్తవారిపేట బస్టాండ్ వద్ద విద్యార్థుల నిరసన
ప్రకాశం: బేస్తవారిపేట ZPHS విద్యార్థులు సోమవారం బస్టాండ్ వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించారు. గిద్దలూరు డిపోకు చెందిన గొల్లపల్లి రోడ్డు బస్సు సమయానికి రాకపోవడం, తరచుగా ఆలస్యంగా రావడంతో పాఠశాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. బస్సు సమయానికి రాకపోవడం వల్ల పాఠశాలకు ప్రతిరోజు ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.