VIDEO: పాడేరు ఐటీడీఏ వద్ద జలగలగడ్డ వాసుల ఆందోళన
ASR: తమ ఊరికి మంజూరైన రూ.90 లక్షల రోడ్డును కొరుబయలు గ్రామస్తులు అడ్డుకుని, నడిచే దారికి కంచెలు వేశారని జలగలగడ్డ వాసులు పాడేరు ఐటీడీఏ ఎదుట దీక్షకు దిగారు. కంచెను ప్రశ్నించిన తమపై దాడి చేశారని, బాబురావు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పట్టించుకోవడం లేదని, న్యాయం జరిగేదాకా కదిలేది లేదని తేల్చిచెప్పారు.