బాలికలకు HPV టీకాలు.. ఎక్కడంటే..?
MDCL: ఉప్పల్ నియోజకవర్గంలో 14-15 ఏళ్ల వయస్సు ఉన్న బాలికలందరికీ ఇవాళ HPV టీకా అందుబాటులో ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. PHC ఉప్పల్, UPHC మల్లాపూర్, PCH జవహర్ నగర్, PHC కీసర, PHC మల్కాజ్‌గిరి, PHC అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు లోనవ్వకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.