రూ.916 కోట్లతో దగదర్తిలో విమానాశ్రయం

AP: నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయం మొదటి దశ పనులను పీపీపీ విధానంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.916 కోట్లను కేటాయించనుంది. జిల్లాలో పారిశ్రామికంగా, పర్యాటకంగా జరిగే కార్యకలాపాలతో విమానాశ్రయం నుంచి సరకు రవాణా బాగా పెరుగుతుందని APADCL అంచనా వేసింది. దీని వల్ల కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల ప్రజలు, పరిశ్రమలకు ప్రయోజనం చేకూరనుంది.