ఒక్క షో కూడా ఆడదన్నారు: వేణు ఊడుగుల
'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ సక్సెస్ మీట్‌లో దర్శకనిర్మాత వేణు ఊడుగుల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విడుదలకు ముందు ఓ నిర్మాతకు ఈ మూవీ చూపించాం. ఆయనతోపాటు మరో నలుగురు వచ్చారు. విరామం తర్వాత వెళ్లిపోయారు. ఆ తర్వాత మూవీపై వ్యతిరేక ప్రచారం చేశారు. ఒక్క షో కూడా ఆడదన్నారు. కానీ ఈ రోజు మా సినిమాని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారు' అని పేర్కొన్నాడు.