అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ
MNCL: జన్నారం మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ అన్నారు. ఇవాళ జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరుగుతుందన్నారు. ప్రజలు కూడా పన్నులను చెల్లించాలని ఆయన కోరారు.