విజయవాడ దుర్గమ్మ అన్నదానానికి విరాళం

విజయవాడ దుర్గమ్మ అన్నదానానికి విరాళం

NTR: ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ అమ్మవారి అన్న ప్రసాద వితరణ నిమిత్తం హైదరాబాద్‌కు చెందిన ఎం. నారాయణస్వామి కుటుంబ సభ్యులు రూ. 1,01,116 విరాళాన్ని గురువారం అందజేశారు. శ్రీ ఎం. నారాయణస్వామి పేరిట ఈ మొత్తాన్ని ఆలయ అధికారులను కలిసి అందజేశారు. అమ్మవారి సేవలో భాగంగా ఈ వితరణ చేయడం పట్ల ఆలయ అధికారులు నారాయణస్వామి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.