వైభవంగా లక్ష కుంకుమార్చన

వైభవంగా లక్ష కుంకుమార్చన

విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం అష్ట దళ పద్మారాధన, లక్ష కుంకుమార్చన పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఉభయ దాతలు, అర్చక బృందం, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.