హెల్మెట్ ధరించిన భార్య భర్తలకు SI అభినందనలు

హెల్మెట్ ధరించిన భార్య భర్తలకు SI అభినందనలు

PPM: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్య భర్తలు ఇద్దరూ హెల్మెట్ ధరించుకున్నందుకు సీతానగరం ఎస్సై హేమలత వారికి అభినందనలు తెలిపారు. శనివారం జోగంపేటలో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో భార్య భర్తలు ఇద్దరూ హెల్మెట్ వేసుకోవడం చూసి వారిని ఆపి వారికి అభినందనలు తెలిపారు. రహదారి భద్రత నియమాలు పాటిస్తూ సేఫ్ జర్నీ చేయాలంటూ వాహన చోదకులకు తెలియజేశారు.