తిమ్మప్ప స్వామి భక్తులకు తప్పని మురుగు కష్టాలు
GDWL: మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ తిమ్మప్ప స్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన దారిలో డ్రైనేజీ పైపులు పగిలిపోయి, మురుగునీరు రోడ్డుపై ఏరులై పారుతోంది. దేవుడి దర్శనానికి వెళ్లే భక్తులకు మురుగునీరు స్వాగతం పలుకుతుందని స్థానికులు పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో భక్తులు ఆ మురుగునీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.