అభ్యుదయ రైతులకు విత్తన పంపిణీ

JGL: 'నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం' అనే కార్యక్రమాన్ని శాస్త్రవేత్త సాద్వి, ఏవో చంద్ర దీపక్ ఇవాళ మల్యాల రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభ్యుదయ రైతులకు 30 వరి, 15 పెసర విత్తన కిట్లను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా ఎంపికైన అభ్యుదయ రైతులకు వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా ఉత్పత్తి చేసిన నాణ్యమైన విత్తనం అందించబడుతుందన్నారు.