'ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి'

'ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి'

కృష్ణా: నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అవనిగడ్డ సీఐ యువకుమార్ తెలిపారు. ఆదివారం కోడూరు మండలం నరకనపల్లి గ్రామంలో జరుగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించి కమిటీ వారికి సూచనలు చేశారు. మతసామరస్యంతో నిమజ్జన వేడుకలను నిర్వహించుకోవాలని, ఎవరిని కించపరిచే పాటలు పెట్టవద్దని తెలిపారు.