పెన్షనర్ల సంక్షేమానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే నాయిని
HNK: కాజీపేట పట్టణంలోని రైల్వే సంఘ్ కార్యాలయంలో పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకలకు మంగళవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాట్లాడుతూ.. పెన్షనర్ల సేవలు అపారమని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు.