ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన డంపింగ్ యార్డ్ సమస్య

HNK: కాజీపేట మండలం మడికొండ డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రతపై రాష్ట్ర అసెంబ్లీలో నేడు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రస్తావించారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న పొగతో రాంపురం, మడికొండ, ధర్మాసాగర్, ఎల్కుర్తి తదితర గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను కడియం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.