ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు
SRCL: చందుర్తి మండలం సనుగుల ప్రాథమిక పాఠశాలలో బాబు జగజీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కట్టుకూరి ముఖేష్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానేత ఆయన జీవితమంతా సమానత్వం సామాజిక న్యాయం దళితుల అభ్యున్నతి కోసం అంకితం చేశారన్నారు.