రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులుగా కామన

కోనసీమ: రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులుగా కామన ప్రభాకరరావు నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఉత్తర్వులు వచ్చాయని కామన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గ్రామస్థాయి నుండి తన ప్రస్థానం ఆరంభించిన ఆయన రాష్ట్రస్థాయిలో పార్టీలో పలు పదవులు అలంకరించారు. మండపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటి చేసి ఓటమి చెందారు.