తమ సమస్యలు పరిష్కరించాలని సర్వేయర్లు వినతి
MNCL: తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా సర్వేయర్లు కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఇవాళ వినతి పత్రం ఇచ్చారు. టీఎన్జీవో ప్రెసిడెంట్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా టీఎన్జీవో ఎస్ఎల్ఆర్ ప్రెసిడెంట్ సి. ఆశిష్ కుమార్, సెక్రటరీ సైదులు కలెక్టర్‌ను కలిశారు. జిల్లాలో పనిచేస్తున్న సర్వేయర్ల సమస్యలపై చర్చించి, సర్వేకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ మంజూరు చేయాలని కోరారు.