జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
MBNR: జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కార్ పేటలో 40.4 డిగ్రీలు నమోదు కాగా, దేవరకద్ర 39.9, భూత్పూర్ కొత్త మొల్గర 39.6, చిన్న చింతకుంట 39.4, అడ్డాకుల 39.3, డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు వేసవిలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.