తప్పుడు కథనాలపై మండిపడ్డ మాజీ మంత్రి

తప్పుడు కథనాలపై మండిపడ్డ మాజీ మంత్రి

KKD: తుని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తనపై ఓ మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. తన వద్ద పనిచేసిన గన్ మెన్‌కు సంబంధించిన వ్యక్తిగత వివాదాలను తనకు అన్వయించడం తప్పుదారి పట్టించే చర్య అని అన్నారు. ఆ గన్ మెన్ ప్రస్తుతం DY.CM పవన్ కళ్యాణ్ వద్ద పని చేస్తున్నారన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.