బంగ్లాలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం
SRPT: నాగారం మండలం బంగ్లా గ్రామపంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని, సర్పంచ్ సుజాత - వెంకన్న అన్నారు. ఆదివారం నాగారం బంగ్లా X రోడ్డులో సుమారు రూ. 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న అంతర్గత సీసీ రోడ్డు పనులను ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలు సహకరించాలని సర్పంచ్ కోరారు.