ప్రభుత్వ కార్యాలయాల తీరుపై విమర్శలు
VKB: యాలాల మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10గంటలు దాటినా కూడా తెరుచుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు కార్యాలయాలకు తాళాలు వేసి కనిపించాయి. విధులు ప్రారంభించాల్సిన సమయానికి కూడా అధికారులు హాజరు కాకపోవడం ఏమిటని మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.