విద్యుత్ శాఖ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
CTR: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు పురస్కరించుకుని విద్యుత్ శాఖ రూపొందించిన పోస్టర్లను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆవిష్కరించారు. సోమవారం దొడ్డిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈనెల 20వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాల్లో విద్యుత్‌ను ఆదా చేయడంపై వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు.