అలర్ట్‌గా ఉండండి.. పోలీసుల హెచ్చరిక

TG: సైబర్ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ‘సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనలతో జాగ్రత్త. డిస్కౌంట్లు, ఆఫర్లు అంటూ వచ్చే లింక్స్ క్లిక్ చేసేముందు ఆలోచించండి. మీ బలహీనతను ఆసరాగా చేసుకొని జరుగుతున్న మోసమిది. అప్రమత్తంగా ఉండండి’ అని పేర్కొన్నారు.