అధికారులకు సౌకర్యాలు కల్పించాలని డీపీఓకు వినతి

అధికారులకు సౌకర్యాలు కల్పించాలని డీపీఓకు వినతి

NRML: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులకు తగిన వసతులు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌కు జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కోరారు. పంచాయతీ కార్యాలయంలో డీపీఓను పలువురు కలిశారు. ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు రవాణా, భోజనం, రెమ్యూనరేషన్ తదితర సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.