VIDEO: కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
JN: చిల్పూర్ మండలం నష్కల్ రామాలయం సమీపంలో గురువారం ప్రమాదవశాత్తు సైకిల్‌తో పాటు కాలువలో పడిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు వంగాలపల్లి గ్రామానికి చెందిన ఏడో తరగతి, 8వ తరగతికి చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.