నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

VKB: శ్రీ నగరేశ్వర దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో శ్రీ నగరేశ్వర దేవాలయ పాలక మండలి నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యవర్గ సభ్యులు కలిసిమెలిసి ఆలయ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు.