అగ్ని ప్రమాదాలతో ప్రజల్లో ఆందోళన
శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల సంతబొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామంలో ధూపాన భాస్కరరావు చెందిన షెడ్లో మైక్ సెట్ లైటింగ్ ఏసీలు కుర్చీలు సుమారు 20 లక్షలు నష్టం సంఘటన మరువకముందే, బూర్జ మండలం ఓవీ వెంకన్నపేటలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.