ముదిగుబ్బలో వైభవంగా కృష్ణాష్టమి ఊరేగింపు

సత్యసాయి: ముదిగుబ్బలో బుధవారం కృష్ణాష్టమి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా సాగింది. మూడు రోజులుగా స్థానిక బస్ షెల్టర్‌లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ భగవాన్ విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహశీల్దార్ నారాయణస్వామి హాజరయ్యారు. మెయిన్ రోడ్డు, దొరిగల్లు రోడ్డు తదితర పురవీధుల గుండా ఊరేగింపు చేశారు.