రేపటి పెద్దిరెడ్డి పర్యటన వివరాలు

CTR: పుంగనూరు రూరల్‌లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేపు పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. చిన్న అలసాపురంలో నల్ల గంగమ్మ ఆలయాన్ని ఉదయం 8:30 గంటలకు ఆయన దర్శిస్తారని తెలిపారు. 9.15 గంటలకు ఆరడి గుంట పంచాయతీ కురవపల్లి మసమ్మ జాతరలో పాల్గొంటారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.