భారీగా గంజాయి స్వాధీనం

భారీగా గంజాయి స్వాధీనం

TG: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రూ.50 లక్షల విలువైన గంజాయితోపాటు, రూ.72,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. తుని నుంచి రైలులో HYD, ముంబయికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను PSకు తరలించి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.