ఇంటర్ ఫలితాల్లో కొండగండ్రేడు విద్యార్థి సత్తా
VZM: గుర్ల మండలం కొండగండ్రేడు గ్రామానికి చెందిన విద్యార్థి ఆల్తి మనోజ్ కుమార్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన మనోజ్ ఎంపీసీలో 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. ఈ ఫలితంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.