వేసవి సెలవుల్లో ఈత ప్రమాదాలపై ఎస్పీ హెచ్చరిక

వేసవి సెలవుల్లో ఈత ప్రమాదాలపై ఎస్పీ హెచ్చరిక

ప్రకాశం: వేసవి సెలవుల్లో పిల్లలు సరదా కోసం కుంటలు, చెరువులు, కాలువలు, బావుల వద్ద ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సూచించారు. నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పిల్లలపై నిఘా ఉంచాలని, ఈత రాకపోతే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రమాదకర జలాశయాల్లోకి వెళ్లవద్దని సూచించారు.