VIDEO: బస్సు-బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు
HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి, అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎల్కతుర్తి మండలానికి చెందిన చిర్రా యుగేందర్ (30) తీవ్రంగా గాయపడ్డాడు. బజాజ్ పల్సర్ బైక్‌పై వెళ్తున్న యుగేందర్‌కు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.