జిల్లాలో 460 జీపీ, 4,102 వార్డులకు ఎన్నికలు
NGKL: జిల్లాలో మూడు విడతలలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 460 గ్రామపంచాయతీలు, 4,102 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో 6 మండలాలలో 151 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి, రెండో విడతలో 7 మండలాల పరిధిలోని 151 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో ఏడు మండలాల పరిధిలోని 158 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి.