VIDEO: ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
SRCL: బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఇవాళ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దీవెనలతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు.