డిసెంబర్ 18 నుండి డీఇఎల్ఈడీ పరీక్షలు

నిజామాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ ఈడీ) (2023-2025 విద్యాసంవత్సరం) మొదటి ఏడాది పరీక్షలు డిసెంబరు 18 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యార్థులతో పాటు అనుత్తీర్ణులైనవారు పరీక్షలు రాసేందుకు అవకాశముందన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.