శివంపేటలో పర్యటించిన డీఎస్పీ

శివంపేటలో పర్యటించిన డీఎస్పీ

MDK: శివంపేట మండలంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. సీఐ రంగ కృష్ణతో కలిసి పాంబండ చెరువు నుంచి పోతులబోగూడ చెరువు వైపు ఉధృతంగా నీరు ప్రవహిస్తుండటంతో కల్వర్టుకు ముప్పు ఏర్పడింది. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో గ్రామస్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గ్రామస్తులు సమస్యను అధికారుల దృష్టికి తెచ్చారు.