VIDEO: వేపచెట్టులోంచి పాలధార.. మహిళల పూజలు

సత్యసాయి: నంబుల పూలకుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను సమీపంలోని వేపచెట్టులో నుంచి బుధవారం పాలలాంటి ద్రవం కారడంతో గ్రామంలో సందడి నెలకొంది. ఈ విషయం తెలిసిన మహిళలు చెట్టు వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ సమర్పించి పూజలు చేశారు. స్థానికులు దీన్ని ఆధ్యాత్మిక సూచనగా భావించగా, వృక్ష శాస్త్రవేత్తలు మాత్రం ఇది జన్యుపరమైన మార్పుల వల్ల సహజ సిద్ధంగా జరిగే పరిణామమని వివరణ ఇచ్చారు.