'ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కడియంను ఓడించాలి'

JN: స్టేషన్ ఘనాపూర్‌లో ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కడియం శ్రీహరిని ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోపాటు ప్రజలు సిద్ధం కావాలని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలం కోనాయిచలం గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అనే అంశంపై గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మారపాక రవి పాల్గొన్నారు.