'పాలపండు'లో పుష్కలంగా విటమిన్స్
పాలపండుగా పిలవబడే మదర్ మిల్క్ ఫ్రూట్ (స్టార్ ఆపిల్) తెల్లని, కొబ్బరి గుజ్జు లాంటి గుజ్జు, తియ్యని రుచితో చాలామందిని మైమరిపిస్తుంది. ఈ పండు ప్రధానంగా రెండు రంగుల్లో లభిస్తుంది. ఒకటి ఊదారంగు, మరొకటి లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. యాపిల్ ఆకారంలో ఉండే ఈ పండు విటమిన్ సి, విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.