మాచర్లలో 144 సెక్షన్‌ అమలు

మాచర్లలో 144 సెక్షన్‌ అమలు

PLD: మాచర్లలో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేశారు. సుమారు 99 రోజుల రిమాండ్ అనంతరం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆయన మాచర్లకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేశారు. ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధించారు.