ఉరవకొండలో పట్టాదారు పాస్ బుక్కుల పంపిణీ
ATP: ఉరవకొండ మండలం మూలగిరిపల్లి రైతులకు నూతన పట్టాదారు పాస్ బుక్కులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం పంపిణీ చేశారు. భూ వివాదాల పరిష్కారానికి, రైతులకు భరోసా ఇచ్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. సకాలంలో సర్వే పూర్తి చేసి పాస్ బుక్కులు అందించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.